రంగారెడ్డి జిల్లా, మంచాల్ మండలం లోయపల్లి గ్రామంలో నూతన ఉపసర్పంచ్ గా గెలుపొందిన బోడుపల్లి నాగరాజును తెలంగాణ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి నాగరాజు విజయానికి అభినందిస్తూ.. సన్మానించారు. లోయపల్లి గ్రామంలోని బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, నూతనంగా గెలుపొందిన వార్డు మెంబర్లు, సీనియర్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ అధ్యక్షులు మరియు స్థానిక కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సభలో, నాయకులు మరియు స్థానిక జనాలు బోడుపల్లి నాగరాజుకు అభినందనలు తెలియజేశారు. గ్రామాభివృద్ధికి, సమగ్ర ప్రజావ్యవస్థ నిర్మాణానికి మద్దతుగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బోడుపల్లి నాగరాజు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, మౌలిక సౌకర్యాల విస్తరణ, ప్రజాసేవలలో పారదర్శకత వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటానని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు సాధనల్లో మద్దతు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు..
