- కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో పోటెత్తిన్న భక్తజనం
- నమో నరసింహాయ మంత్రంతో మారుమ్రోగిన దేవాలయ ప్రాంగణం
కార్తీక మాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తింది. నమో నరసింహాయ మంత్రంతో దేవాలయ ప్రాంగణం మారుమ్రోగింది. యాదగిరీశుని ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయ దర్శనం చేసుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు… దేవాలయ పునర్నిర్మాణం అనంతరం భక్తులు రోజురోజుకి బారీగా పెరుగుతున్నారు. రానున్న రోజుల్లో మరో తిరుమల దేవస్థానంగా యాదాద్రి కాబోయే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు. దేవాలయం దగ్గర్లోని సురేంద్రపురి, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది.

