Homeవరంగల్‌MLA | యువకుడు చీదురు శంకర్ కు ఓటువేసి గెలిపించండి.

MLA | యువకుడు చీదురు శంకర్ కు ఓటువేసి గెలిపించండి.

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు.
  • ఒక ఇల్లు ఇవ్వని చరిత్ర గత ప్రభుత్వానికే దక్కింది.
  • మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్.
  • ‘బ్యాట్’ గుర్తుకు ఓటు వేసి యువకునికి అవకాశం ఇవ్వండి.
  • జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు.

చదువుకున్న యువకుడు చీదురు శంకర్ బ్యాట్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానిక ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక సర్పంచ్ అభ్యర్థి చీదురు శంకర్ గెలుపు కోసం మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు డప్పు చప్పులతో మహిళా కోలాటం వారిచే భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

Wardhannapet Congress Campaign for Cheeduru Shankar 1

ఈ ర్యాలీలో మహిళలు, పురుషులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సర్పంచ్ అభ్యర్థి చీదురు శంకరకు గెలుపు భరోసా కల్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్థానిక ఓటర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీదురు శంకర్ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారం చేపట్టి ఒక ఇల్లు ఇవ్వని చరిత్ర టిఆర్ఎస్కే దక్కిందని ఇద్దేవ చేశారు.

- Advertisement -
Wardhannapet Congress Campaign for Cheeduru Shankar 2

చెరువులు, గుట్టలలో కొందరు మట్టి దొంగతనం చేసారే గాని, స్థానిక సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు మాట్లాడుతూ మచ్చలేని యువకుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చీదురు శంకర్ ‘బ్యాట్’ గుర్తుకు ఓటువేసి అధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే 14 మంది వార్డు సభ్యులను కూడా వారికి కేటాయించిన గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, పట్టణ అధ్యక్షుడు కూసం రాంచందర్, మాజీ ఎంపీటీసీ బొట్ల మహేంద్ర, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్, పోటీ చేస్తున్న వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా, మహిళలు యువతీ యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Wardhannapet Congress Campaign for Cheeduru Shankar 3
- Advertisement -
RELATED ARTICLES

Latest News