Homeహైదరాబాద్‌Education | ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

Education | ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

  • ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులు చెల్లించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి

దేశంలోని పేద మధ్యతరగతి విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్తు పురోగతిని సాధించడానికి విద్య ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి అన్నారు.సోమవారం నాడు అడ్డగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 94 మంది విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు పత్రాన్ని ఆమె సోమవారం స్కూల్ యాజమాన్యానికి అందజేశారు.ఈ సందర్భంగా కావ్యరెడ్డి మాట్లాడుతూ విద్యతోనే దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ మంచిగా చదువుకొని పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

Kavya Reddy Supports Class 10 Students1

నిరుపేద కుటుంబానికి చెందిన కొందరు ప్రజలు పరీక్ష ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో ఉంటారని,విద్యార్థి దశల్లో అత్యంత కీలకమైనది పదవ తరగతి అని అన్నారు.అందువల్ల సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎంపీ వేతనం నుంచి పరీక్షా ఫీజు చెల్లిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు.అనంతరం,పాఠశాలలో సైనా ల్యాబ్,లైబ్రరీని కూడా ఆమె ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీకరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి,డివిజన్ అధ్యక్షురాలు సౌందర్య.నేతలు కన్నాభిరాం,ఉదయ్ యాదవ్,వేణు కిరణ్ గాడ్, వీరన్న,శ్యామల.తదితరులు పాల్గొన్నారు.

Kavya Reddy Supports Class 10 Students 1
- Advertisement -
RELATED ARTICLES

Latest News