Wednesday, December 10, 2025
EPAPER
Homeమహబూబ్‌నగర్‌Illegal Transportation | అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Illegal Transportation | అక్రమ రవాణాపై కఠిన చర్యలు

చెక్ పోస్టులు అప్రమత్తంగా ఉండాలి
పోలీసులకు ఎస్పీ సునీతారెడ్డి ఆదేశం

వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 3(ఆదాబ్ హైదరాబాద్): శాంతిభద్రతల (Law and Order) విషయంలో రాజీ లేదని(No compromise) ఎస్పీ సునీతారెడ్డి (Sp Sunitha Reddy) స్పష్టం చేశారు. అక్రమ రవాణాపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం పెబ్బేరు చెక్‌పోస్ట్‌ (Checkpost)ను ఆకస్మికంగా తనిఖీ (Random check) చేశారు. రిజిస్టర్ (Register) నమోదు, సిబ్బంది అప్రమత్తత, నిఘా (surveillance) వివరాలను స్వయంగా పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల(Panchayat Elections)ను ప్రభావితం చేసే నగదు(Cash), మద్యం(Liquor), బంగారం (Gold) వంటివాటిని చట్టవిరుద్ధంగా రవాణా చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. అసలు అలాంటివాటికి జిల్లాలో స్థానం లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల సమయంలో చట్టాన్ని అతిక్రమించేవారిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారి గురించి ప్రజలు పోలీసులకు వెంటనే చెప్పాలని కోరారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, పెబ్బేరు ఎస్‌ఐలు యుగంధర్ రెడ్డి, దివ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News