వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 3(ఆదాబ్ హైదరాబాద్): పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) శాంతిభద్రతల(Law and Order)కు విఘాతం కలిగించేవారిపై చట్టపరంగా (Legally) కఠిన చర్యలు (Strict Action) తీసుకుంటామని వనపర్తి జిల్లా ఎస్పీ డాక్టర్ సునీతారెడ్డి హెచ్చరించారు. బుధవారం వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో మూడో విడత నామినేషన్ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు(Spontaneously observed). నామినేషన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాలు ప్రజాస్వామ్యానికి (Democracy) గుండెలాంటివని చెప్పారు. ఈ వ్యవస్థ ప్రమాదంలో పడితే ప్రతి అధికారి, ప్రతి కానిస్టేబుల్ తమ బాధ్యతలను అత్యంత క్రమశిక్షణతో నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, వీపనగండ్ల ఎస్‌ఐ రాణి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

