Homeరంగారెడ్డిTribute | వడ్డే ఓబన్న జాతి ఉనికికి చేసిన సేవలు చిరస్మరణీయం

Tribute | వడ్డే ఓబన్న జాతి ఉనికికి చేసిన సేవలు చిరస్మరణీయం

స్వాతంత్ర ఉద్యమాల ద్వారా జాతి ఉనికిని చాటుకున్న గొప్ప వ్యక్తి వడ్డే ఓబన్న అని జవహర్ నగర్ కార్పొరేషన్ మాజీ మేయర్లు మేకల కావ్య, శాంతి కోటేష్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని చెన్నాపురం ప్రధాన రహదారిలోని వడ్డే ఓబన్న విగ్రహానికి పార్టీలకు అతీతంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన చేసిన త్యాగాలు, సేవలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. సమాజ చైతన్యం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.

- Advertisement -
Vadde Obanna Birth Anniversary Tributes

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండలు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు పల్లపు రవి, కూతది సాయికుమార్, అలిగిరి చిత్రా సుబ్రహ్మణ్యం, బింగి లావణ్య, సతీష్ గౌడ్, గొడుగు వేణు, జిట్ట శ్రీవాణి, శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మాజీ వార్డు సభ్యులు బండ కింది ప్రసాద్ గౌడ్, కొమ్ము రాజుల వెంకటేష్, రాజయ్య, వెంకటేష్, విష్ణు తదితరులు పార్టీలకు అతీతంగా పాల్గొని వడ్డే ఓబన్న విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News