Homeనిజామాబాద్‌Urea Shortage | యాప్ తెచ్చిన తిప్పలు.. రైతుకు తప్పని గోస..!

Urea Shortage | యాప్ తెచ్చిన తిప్పలు.. రైతుకు తప్పని గోస..!

  • డిజిటల్ మాయ రైతుకు అందని యూరియా..!
  • యాప్ లో నో స్టాక్.. రైతుకు తప్పని షాక్..!

యూరియా పంపిణీలో పారదర్శత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS యాప్ రైతుల పాలిట గుది బండగా తయారైందని రైతులు వాపోతున్నారు. రైతుకు కావాల్సిన అన్ని ఫర్టిలైజర్స్ ఈ యాప్ లోనే దొరుకుతాయని ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ సాంకేతిక లోపం, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతుల నిరక్షరాస్యత, రైతుల పాలిట యూరియా యాప్ యమపాశంగా మారింది. చిన్న, సన్నకారు,రైతులకు స్మార్ట్ ఫోన్ లేకపోవడం, కొందరికి యాప్ పట్ల అవగాహన లేకపోవడం, టెక్నాలజీ తెలిసిన వారికి యాప్ లో స్టాక్ లభించకపోవడం ఇలా యూరియా యాప్ వల్ల రైతులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

గతంలో పిఎసిఎస్ పరిధిలో మ్యానువల్ గా యూరియా పంపిణీ చేసేవారు. యూరియా అవసరమైన రైతులు సంబంధిత సింగల్ విండో పరిధిలోకి వెళ్లి లేదా అందుబాటులో ఉన్న ఫర్టిలైజర్ షాప్ కి వెళ్లి యూరియా తెచ్చుకునేవారు.కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. డిజిటల్ పేరుతో ప్రభుత్వం కొత్త యాప్ తెచ్చినప్పటికీ కానీ యాప్ వాడకంలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకు యాప్ పట్ల అవగాహన లేకపోవడం, ఎక్కువ మంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవడం కేవలం కీప్యాడ్ ఫోన్లు మాత్రమే ఉండడం వల్ల రైతులు యూరియా కోసం ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది.

- Advertisement -
image 2

దానికి తోడు యాప్ లో ఎప్పుడు నో స్టాక్ అని కనిపించడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యూరియా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అయిపోతుందో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ యూరియా స్టాక్ ఉంది బుక్ చేసుకోవాలని అధికారులు చెప్పినప్పటికీ ఫోన్ ఓపెన్ చేసిన కొద్దీ నిమిషాలకే నో స్టాక్ అని రావడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రైతులు తమ గ్రామం లేదా పక్క గ్రామానికి వెళ్లి యూరియా తెచ్చుకునే పరిస్థితి ఉండేది . కానీ ఇప్పుడు మండల పరిధిలో ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులకు రవాణా భారం పెరుగుతుంది.

తాజాగా తాడ్వాయి మండల కేంద్రంలో యూరియా స్టాక్ అందుబాటులో ఉంది కావాల్సిన రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్దకు వచ్చి వ్యవసాయ అధికారులతో బుక్ చేయించుకోవాలని సోషల్ మీడియా ద్వారా తెలుపగా అక్కడికి వెళ్లిన రైతులకు యాప్ ఓపెన్ చేయగానే నో స్టాక్ అని రావడంతో సంబంధిత వ్యవసాయ అధికారితో వాగ్వాదానికి దిగిన రైతులు అనంతరం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. నిరక్షరాసురైన రైతులు యూరియా బుకింగ్ చేసుకోవడం కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ లేదా ఐవిఆర్ఎస్ ఆరాధిత బుకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సింగిల్ విండోలు ముందస్తు చెల్లింపుల్లో ఆలస్యం.
సరిపడా యూరియా లేక రైతుల అవస్థలు.

డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడంతో యూరియా కొరత ఏర్పడుతుంది. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులతో పోలిస్తే,ఎక్కువగా సొసైటీ పరిధిలో యూరియా స్టాక్ విక్రయిస్తుండడంతో సొసైటీలు ముందుగా డబ్బులు చెల్లించి,టీజీ మార్కపేడ్ నుండి యూరియాను తీసుకురావాల్సి ఉంటుంది. కొన్ని సందర్భలలో సొసైటీలు సకాలంలో డీడీలు తీయక యూరియా సమయానికి రావడం లేదని తద్వారా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News