Friday, February 27, 2026
Homeకరీంనగర్Anathapally | అనంతపల్లి గ్రామంలో అభివృద్ధి దూకుడు

Anathapally | అనంతపల్లి గ్రామంలో అభివృద్ధి దూకుడు

గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో అనంతపల్లి గ్రామ అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ జాగిరి వెంకటేష్ అన్నారు బోయినపల్లి లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ వాళ్ళు మాట్లాడే ముందు గత పది సంవత్సరాలలో అనంతపల్లిలో ఏమి అభివృద్ధి చేసారో నిరూపించాలని డిమాండ్ చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజపాలనలో, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం ఆధ్వర్యంలో మా గ్రామం నల్లగొండ వరకు డబుల్ రోడ్డు మంజూరి చేయించి పనులు కూడ ప్రారంభించారన్నారు. ఇంకా ఇందిరమ్మా ఇండ్లులాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయాన్నారు. రాబోయే కాలం లో కూడ రేవంత్ రెడ్డి సి ఎం, సత్యమన్నా ఎమ్మెల్యే గా కొనసాగుతారని అన్నారు. గ్రామాలు అభివృద్ధి జరుగుతుంటే ఓర్చుకోలేని భీ ఆర్ ఎస్ విమర్శలు చేస్తే సహించమన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News