Tuesday, April 14, 2026
HomeతెలంగాణHeat Wave Alert | భగ భగమంటున్న భానుడు..

Heat Wave Alert | భగ భగమంటున్న భానుడు..

  • తెలంగాణాలో మండుతున్న ఎండలు..
  • చాలాచోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు..

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వివిధ చోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతుండటంతో ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌తోపాటు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్‌ జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్ జారీచేసింది.

మంగళవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో.. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. గురువారం నుంచి ఎండలు మరింత ఠారెత్తించే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటలవరకు బయటకు రావద్దని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News