Homeహైదరాబాద్‌Naveen Yadav | టీవీ ఫెడరేషన్ ఏకగ్రీవ మద్దతు

Naveen Yadav | టీవీ ఫెడరేషన్ ఏకగ్రీవ మద్దతు

ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్‌కి టివి సీరియల్ ఫెడరేషన్ (TV Serial Federation) ఏకగ్రీవంగా మద్దతు (Support) తెలిపింది. ఈ నేపథ్యంలో వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) యూసుఫగూడలో సమావేశమై ధన్యవాదాలు తెలిపారు. టివి ఇండస్ట్రీ సంక్షేమానికి సంబంధించి సీఎం రేవంత్‌(CM Revanth)తో మాట్లాడతానని చెప్పారు. గతంలో ఉన్న స్థానిక శాసన సభ్యుడు (Mla) పట్టించుకొని ఉంటే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావని విమర్శించారు. ప్రభుత్వంలో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి(Hyderabad District In-charge Minister)గా టీవీ సీరియల్ ఫెడరేషన్ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.

- Advertisement -
WhatsApp Image 2025 11 06 at 21.22.45

ఆయన ఇంకా ఏమన్నారంటే..

మాది ప్రజా ప్రభుత్వం. ప్రజా పాలన. మేము చెప్పిందే వినాలని కాదు. మీరు చెప్పిందే మేము వింటాం. దేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు, మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వాలే తీసుకున్నాయి. టివి సీరియల్ ఇండస్ట్రీ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు తెలిపింది. ప్రస్తుతం ప్రేక్షకుల సౌలభ్యానికి అనుగుణంగా టెక్నాలజీ మారింది. దానికి తగ్గట్లు మన వ్యవస్థ మారాలి. ఇండస్ట్రీకి మరింత గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, సీనియర్ నటుడు సుమన్ (Senior Actor Suman) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News