Homeనిజామాబాద్‌Kamareddy Farmers Protest | రోడ్డెక్కిన రైతన్న.. కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై వడ్ల బస్తాలతో నిరసన

Kamareddy Farmers Protest | రోడ్డెక్కిన రైతన్న.. కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై వడ్ల బస్తాలతో నిరసన

  • వడ్లు తూకం వేసి ఐదు రోజులైనా గోదాముకు తరలించలేదని ఆగ్రహం..!Kamareddy Farmers Protest
  • రహదారిపై వడ్ల బస్తాలు వేయడంతో స్తంభించిన ట్రాఫిక్
  • సింగిల్ విండో చైర్మన్, హామీతో శాంతించిన రైతు..!

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తూకం వేసి ఐదు రోజులవుతున్నా గోదాముకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు రోడ్డెక్కాడు (Kamareddy Farmers Protest). తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన ఏనుగు రమేష్ రెడ్డి అనే రైతు తన వడ్ల బస్తాలను ప్రధాన రహదారిపై వేసి సోమవారం నిరసనకు దిగాడు.

అసలేం జరిగిందంటే..?Kamareddy Farmers Protest

- Advertisement -

తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో ఐదు రోజుల క్రితం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన ఏనుగు రమేష్ రెడ్డికి చెందిన 467 బస్తాలు, బద్దం రామిరెడ్డికి చెందిన 407 వడ్ల బస్తాలను సింగిల్ విండో అధికారులు తూకం వేశారు. అయితే ఐదు రోజులు గడిచినా ఆ బస్తాలను గోదాముకు తరలించలేదు. దీనిపై రైతు రమేష్ రెడ్డి సింగిల్ విండో సీఈఓ నరసింహులను పదేపదే ప్రశ్నించగా, లారీలు అందుబాటులో లేవని, సొంత ట్రాక్టర్‌లో గోదాముకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
గోదాము వద్ద నిరాకరణతో ఆగ్రహం
సీఈఓ సూచన మేరకు రైతు తన సొంత ట్రాక్టర్‌లో 100 వడ్ల బస్తాలను వేసుకుని గోదాము వద్దకు వెళ్లాడు. అయితే, జీపీఎస్ ట్రాకర్ అమర్చిన వాహనాల్లో వచ్చిన ధాన్యాన్ని మాత్రమే గోదాములో నిల్వ చేస్తామని, ట్రాక్టర్‌కు జీపీఎస్ లేనందున దించుకోమని గోదాము ఇన్‌ఛార్జీలు తేల్చిచెప్పారు. దీంతో సింగిల్ విండో సీఈఓ నర్సిములు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు, కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పది వడ్ల బస్తాలను అడ్డంగా వేసి నిరసన చేపట్టాడు. ఫలితంగా ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.

చైర్మన్ హామీతో విరమణ…!Kamareddy Farmers Protest

విషయం తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రావు ఘటనా స్థలానికి చేరుకుని రైతుతో చర్చించారు. ట్రాక్టర్ కిరాయి, హమాలీ ఛార్జీలను తామే భరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతు రమేష్ రెడ్డి తన నిరసనను విరమించాడు.


సీఈఓ చెప్పాడనే తీసుకెళ్లా..”
తాడ్వాయి సింగిల్ విండో సీఈఓ తన సొంత ట్రాక్టర్‌లో వడ్లు గోదాముకు తీసుకెళ్లాలని సూచించడంతోనే నేను 100 బస్తాలు తరలించాను. జీపీఎస్ ట్రాకర్ విధానం అమల్లో ఉందని సీఈఓకు తెలిసినప్పటికీ నాకు ఆ విషయం చెప్పకుండా ఇబ్బందులకు గురిచేశారు. వడ్లు కాంటా వేసి ఐదు రోజులవుతున్నా ఇప్పటికీ గోదాముకు తరలించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మిగిలిన వడ్ల బస్తాలను వెంటనే గోదాముకు తరలించాలి.“ఏనుగు రమేష్ రెడ్డి, బాధిత రైతు
”
(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News