Homeఆంధ్రప్రదేశ్AP Panchayat Elections | ఏపీలో మూడో విడత పంచాయితీ ఎన్నికలు..

AP Panchayat Elections | ఏపీలో మూడో విడత పంచాయితీ ఎన్నికలు..

  • ఊపందుకున్న నామినేషన్ల పర్వం..AP Panchayat Elections
  • తొలిరోజు 16, 505 నామినేషన్లు దాఖలు..

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) ప్రక్రియ జోరుగా సాగుతోంది. మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ఊపందుకుంది. తొలి రెండు రోజుల్లోనే సర్పంచ్ పదవుల కోసం ఏకంగా 16,505 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాల పరిధిలోని 4,244 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈ నెల‌ 21న 4,929 నామినేషన్లు రాగా, రెండో రోజైన నిన్న‌ ఆ సంఖ్య ఒక్కసారిగా పెరిగి 11,576కు చేరింది. నామినేషన్ల దాఖలుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. మూడో విడత పోలింగ్‌ను డిసెంబర్ 2న నిర్వహించనున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల‌ 26న జరగనుంది. మొత్తం 42 రెవెన్యూ డివిజన్లలోని 201 మండలాల్లో 3,949 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో 758 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,191 సర్పంచ్, 25,061 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మొత్తం 62,730 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News