- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ.
బాలలు, మహిళల హక్కుల పరిరక్షణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి(DLSA Kandukuri Pooja) పూజ తెలిపారు. బుధవారం వరంగల్ ఆటోనగర్ లోని పరిశీలన గృహం, దేశాయిపేట లోని ఇండియా డిసిపిల్స్ మిషన్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్, సఖీ వన్ స్టాప్ సెంటర్లను వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ(DLSA Kandukuri Pooja) సందర్శించి, రికార్డులను తనిఖీ నిర్వహించారు.


ఈ సందర్భంగా పరిశీలన గృహం, ఇండియన్ డిసిపిల్స్ మిషన్, (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్)లోని బాలలతో న్యాయమూర్తి ఆత్మీయంగా మాట్లాడి, వారి విద్య, ఆరోగ్యం, వసతి, భోజనం, భద్రత ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, వారి సమస్యలను సానుభూతితో విని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

సఖీ వన్ స్టాప్ సెంటర్ను సందర్శించిన న్యాయమూర్తి, అక్కడ అందిస్తున్న సేవలు, బాధిత మహిళలకు కల్పిస్తున్న న్యాయ సహాయం, కౌన్సెలింగ్, వైద్య సహాయం, పోలీస్ సహకారం, పునరావాస సేవలు తదితర అంశాలను పరిశీలించారు. సంబంధిత రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి, బాధితులకు సకాలంలో అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
