- సీజేఐకి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ వినతి
తెలంగాణ హైకోర్టులో అసాధారణంగా పేరుకుపోతున్న కేసుల దృష్ట్యా, మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు విజ్ఞప్తి చేసింది. సమర్థవంతమైన న్యాయ పరిపాలన, కేసుల సత్వర పరిష్కారం కోసం హైకోర్టులో ప్రస్తుతం ఉన్న జడ్జీల ఖాళీలను సైతం వీలైనంత త్వరగా భర్తీ చేయాలని అసోసియేషన్ తమ వినతిపత్రంలో కోరింది.
సీజేఐని కలిసి ఈ వినతిపత్రం సమర్పించిన ప్రతినిధి బృందంలోఅసోసియేషన్ అధ్యక్షులు ఎస్. సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డి.ఎల్. పాండు, కార్యదర్శి పి. శ్రావణ్ కుమార్ గౌడ్, సంయుక్త కార్యదర్శి పి. కృష్ణ కీర్తన, కోశాధికారి బి. బాలాజీ, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శి జె. విష్ణువర్ధన్ తదితరులు ఉన్నారు.
- Advertisement -
