Homeనిజామాబాద్‌Tadwai | తాడ్వాయి బస్టాండ్ కు దశతిరిగేనా…!

Tadwai | తాడ్వాయి బస్టాండ్ కు దశతిరిగేనా…!

  • పెచ్చులూడుతూ శిధిలావస్థకి చేరిన తాడ్వాయి బస్టాండ్..
  • ఏండ్లుగా బస్సులకు నోచుకోని తాడ్వాయి బస్టాండ్..
  • ఎండ, వానకు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు…
  • ఇకనైనా బస్టాండ్ మరమ్మతులు చేసి ఉపయోగం లోకి తేవాలని ప్రయాణికుల డిమాండ్ …

ప్రయాణికుల మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతో, నిర్మించిన తాడ్వాయి బస్టాండ్ అధికారుల నిర్లక్ష్యంతో మరుగున పడింది.గత కొన్ని సంవత్సరాలుగా బస్టాండ్ లోకి బస్సులు రాక శిధిలవస్థకు చేరింది. 35 ఏళ్లు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక బస్టాండ్ ఉండాలని సంకల్పంతో తాడ్వాయి మండల కేంద్రానికి బస్టాండ్ నిర్మించింది. బస్టాండ్ కు విశాలమైన ప్రాంగణం ఉన్నప్పటికీ,బస్టాండ్ లోకి బస్సులు రాకపోవడంతో బస్టాండ్ ఉపయోగం లో లేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది.

బస్టాండ్ బాగోగులు పట్టించుకునే వాడు లేక స్లాబ్ పెచ్చులూడిపోయి, బస్టాండ్ లోపల ఉన్న షెటర్స్ వంగిపోయి, ప్రయాణికులు కూర్చుని దిమ్మలు కూలిపోయి, బస్టాండ్ ప్రాంగణం మొత్తం పిచ్చి మొక్కలు నిండిపోయింది. బస్టాండ్ లోకి బస్సులు రాక ప్రయాణికులు బస్సుల కోసం ఎండకు ఎండి, వానకు తడుస్తూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అవేవీ ఆర్టీసీ అధికారులకు పట్టడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.లక్షల రూపాయలు వెచ్చించి కట్టిన బస్టాండ్ వాడకంలో లేక శిథిలావస్థలో చేరుకున్న బస్టాండ్ గురించి పట్టించుకుని నాధుడే కరువయ్యాడు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బస్టాండ్ మరమ్మతులు చేసి బస్టాండ్లోకి బస్సులు వచ్చే విధంగా చూసి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని కోరుచున్నారు..

- Advertisement -

బస్టాండ్ తొందర్లో వాడుకలోకి తెస్తాం.
కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ కుమార్ వివరణ.

20 రోజుల క్రితం తాడ్వాయి బస్టాండ్ సంబంధిత ఏఈ తో కలిసి పరిశీలించాము.దీనిపై ఉన్నతాధికారులకు,నివేదికలు అందించాం.త్వరలో తాడ్వాయి బస్టాండ్ కి మరమ్మతులు చేయించి, బస్సులు బస్టాండ్ లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. బస్టాండ్ ను తొందర్లో ప్రయాణికులకు అందులో అందుబాటులోకి చేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News