Homeరంగారెడ్డిFreshers Day Celebrations | నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఘనంగా ‘స్వాగత్‌ 2కె26’

Freshers Day Celebrations | నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఘనంగా ‘స్వాగత్‌ 2కె26’

  • ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నూతన విద్యార్థులు
  • విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమివ్వాలి: కళాశాల కార్యదర్శి త్రిశూల్‌ రెడ్డి
  • లక్ష్య సాధనకు పట్టుదల, క్రమశిక్షణ కీలకం: డైరెక్టర్‌ డా. ఏ. మోహన్‌

మేడ్చల్‌: గుండ్లపోచంపల్లి పరిధిలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘స్వాగత్‌ 2కె26’ పేరిట ఫ్రెషర్స్‌ డే వేడుకలను(Freshers Day Celebrations) ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్‌ జె. నర్సింహారెడ్డి, కార్యదర్శి జె. త్రిశూల్‌ రెడ్డి, కోశాధికారి త్రిలోక్‌ రెడ్డి, డైరెక్టర్‌ డా. ఏ. మోహన్‌, ప్రిన్సిపాల్‌ డా. ఆర్‌. లోకనాథం, ఎఫ్.ఎం.ఈ విభాగాధిపతి డా.మల్లికార్జునయ్య, డా. నవీన్, కార్యక్రమ సమన్వయకర్తలు స్వప్న, రాధమ్మ, డా. పి. వెంకటరావు, ప్రసాద్‌, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకల్లో నూతన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -

విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమివ్వాలి: త్రిశూల్‌ రెడ్డి

కళాశాల కార్యదర్శి జె. త్రిశూల్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కళాశాల విద్య ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగాన్ని సంపాదించేందుకు మాత్రమే కాకుండా, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి, సమాజంలో బాధ్యతగల పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యాభ్యాసంతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సమయపాలన, పరస్పర గౌరవం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.

నూతన విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. కళాశాలలో లభించే విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, అధ్యాపకుల సూచనలు పాటిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. అపజయాలకు కుంగిపోకుండా వాటిని విజయానికి మెట్లుగా భావించి ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

లక్ష్య సాధనకు పట్టుదల, క్రమశిక్షణ కీలకం: డైరెక్టర్‌ డా. ఏ. మోహన్‌

కళాశాల డైరెక్టర్‌ డా. ఏ. మోహన్‌ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి సరైన దిశలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ప్రాయోగిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి కనబరచాలని తెలిపారు. కళాశాలలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News