Homeఆరోగ్యంProtein Diet | తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి..

Protein Diet | తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి..

  • ప్రోటీన్స్ ఎక్కువుగా వుండే ఫుడ్స్ తినాలి..
  • శరీర నిర్మాణానికి ప్రధాన మూలం ప్రోటీన్..

వేసవి కాలంలో శరీరానికి తేలికగా, చల్లదనాన్ని అందించేలా ఉండే ప్రోటీన్ ఆహారాలను ఎంపిక చేయడం చాలా ముఖ్యం. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఎక్కువ శ్రమ పడుతుంది. అందుకే ఈ సమయంలో తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా, శరీరానికి శక్తినిచ్చేలా ఉండాలి. క‌నుక ఇటువంటి స‌మ‌యంలో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ సాధారణంగా బరువు తగ్గడానికే ఉపయోగపడుతుందని అనుకుంటారు.

కానీ వాస్తవానికి ఇది శరీర నిర్మాణానికి ప్రధాన మూలం. కండరాల పునరుద్ధరణ, రోగ నిరోధక శక్తి పెంపు, అలాగే ఎక్కువసేపు తృప్తిగా ఉండటానికి ఇది కీలకం. ముఖ్యంగా శరీరం ప్రోటీన్‌ను నిల్వ చేసుకోలేకపోవడం వల్ల ప్రతిరోజూ ఆహారంలో చేర్చడం అవసరం. వేసవిలో ప్రోటీన్ ఆహారాలను ఎంచుకునే సమయంలో అవి తేలికగా, హైడ్రేటెడ్‌గా, జీర్ణానికి సులభంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరంలో అధిక వేడి పెరగకుండా, శక్తి స్థాయిలు సంతుల్యంగా ఉంటాయి. వేస‌వి కాలంలో తీసుకోవాల్సిన‌ ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల గురించి పోష‌కాహార నిపుణులు వివ‌రిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News