Homeరంగారెడ్డిMedchal | మేడ్చల్‌లో జ్యువెలరీ షాపులో భారీ చోరీ

Medchal | మేడ్చల్‌లో జ్యువెలరీ షాపులో భారీ చోరీ

  • గోడకు కన్నం వేసి దుకాణంలోకి చొరబాటు.. బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

మేడ్చల్(Medchal ) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ జ్యువెలరీ షాపులో చోరీ(Theft) ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలరీ షాపును(Shree Jagadamba Jewellers) దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణం వెనుక భాగంలో గోడకు కన్నం వేసి లోపలికి చొరబడిన దుండగులు విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు షాపు యజమాని శేషామాల్ చౌదరి తెలిపారు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్లూస్ టీమ్‌ను రప్పించి దొంగతనానికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. దుండగులు ఏ మార్గంలో వచ్చారు, ఎంత మొత్తంలో ఆభరణాలను అపహరించారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, విలువైన బంగారు, వెండి ఆభరణాలతో వ్యాపారం నిర్వహించే జ్యువెలరీ షాపులో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గమనార్హం. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే చోరీ జరగడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను త్వరగా గుర్తించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News