Homeనిజామాబాద్‌Tadwai Mandal | మండల స్థాయి సమీక్షా సమావేశానికి సమయ పాలన పాటించని అధికారులు, ప్రజాప్రతినిధులు..!

Tadwai Mandal | మండల స్థాయి సమీక్షా సమావేశానికి సమయ పాలన పాటించని అధికారులు, ప్రజాప్రతినిధులు..!

తాడ్వాయి: ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించే మండల సాయి సమీక్ష సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, సమయాలపాలన పాటించలలేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ వేదిక 11 గంటలకు ప్రారంభం కాగా ప్రజా ప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కావడం లేదు సమయపాలన పాటించడం లేదు 11:30 దాటిన సమావేశం ప్రారంభం కాకపోవడమే దీనికి నిదర్శనం, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక నిర్వహించే ఈ సమీక్ష సమావేశాలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు విస్మరిస్తున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి.

గతంలో మూడు నెలలకు ఒకసారి జరిగే సమీక్ష సమావేశం ప్రజా సమస్యల పరిష్కారం కోసం 45 రోజులకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. సమస్యలు చర్చించడం వాటి పరిష్కారానికి మార్గాలు వెతకడం ఈ మండల సమీక్ష సమావేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు అన్ని గ్రామాల సర్పంచులు హాజరు కావలసి ఉంటుంది ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కావాల్సిన ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది అలాంటి సమావేశానికి సమయపాలన పాటించడం పోవడం పట్ల వారి నిర్లక్ష్యానికి నిదర్శనం పడుతుంది. అటు ప్రజాప్రతినిధులు,ఇటు అధికారులు సకాలంలో సమావేశానికి హాజరై సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

ప్రజా ప్రతినిధులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలి. ఎంపీడీవో భరత్ కుమార్ మంగళవారం తాడ్వాయి మండల(Tadwai Mandal) కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి రఘునందన్ ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి ప్రజాప్రతినిధులు సమయపాలన పాటించకపోవడం వాస్తవమే, అధికారులు సమయపాలన పాటించినప్పటికీ కూడా ప్రజా ప్రతినిధులు సకాలంలో సమావేశం కి రాకపోవడం వల్ల సమీక్ష సమావేశం నిర్వహించడం ఆలస్యం అవుతుంది. ఇకనైనా తదుపరి సమావేశానికి ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరుతున్నాను.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News