- ఎన్.ఎస్.సి. ఒక అద్భుత అవకాశం అంటున్న విశ్లేషకులు..
డబ్బు దాచుకోవడమే కాదు, దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేయడమే అసలైన ఆర్థిక క్రమశిక్షణ. మన భారతీయులకు ఎప్పుడూ ఒకటే సందేహం.. పోస్ట్ ఆఫీస్ బెటరా? లేక బ్యాంక్ సేఫా? ముఖ్యంగా పన్ను ఆదా విషయానికి వస్తే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, బ్యాంక్ 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఈ రెండూ హాట్ ఫేవరెట్లే. ఐదేళ్ల పాటు మీ డబ్బును లాక్ చేసి, నిశ్చింతగా లాభాలు పొందాలంటే ఈ రెండింటిలో ఏది మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందో లోతుగా విశ్లేషించుకోవాలి.
ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం ఎన్.ఎస్.సి. వడ్డీ రేటును 7.7 శాతంగా నిర్ణయించింది. ఇది దాదాపు చాలా బ్యాంకుల ఎఫ్ డీ రేట్ల కంటే ఎక్కువే. పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత వడ్డీ రేట్ల పరిస్థితుల్లో, ప్రభుత్వ గ్యారెంటీతో పాటు అధిక వడ్డీ ఆశించే వారికి ఎన్.ఎస్.సి. ఒక అద్భుతమైన ఆప్షన్. అయితే లిక్విడిటీ కంటే గ్యారెంటీ రిటర్న్స్ ముఖ్యం అనుకునేవారు దీని వైపు చూడొచ్చు.
