ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా రూపొందుతున్న ‘ధర్మన్’లోకి(Dharman) మరో క్రేజీ హీరో చేరారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భాగమయ్యారు.
డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకునే నటన, ప్రత్యేకమైన ఎనర్జీతో రామ్ పోతినేని తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘దేవదాస్’తో గుర్తుండిపోయే అరంగేట్రం చేసిన ఆయన, ‘రెడీ’, ‘కందిరీగ’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. వరుస విజయాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు.
రామ్ ఎంట్రీని ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో స్టైలిష్ సర్ప్రైజ్ ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, రామ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన క్షణం ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటుంది. విమానంలో ప్రయాణికులకు ముందున్న ప్రయాణంలో టర్బులెన్స్ ఉండబోతోందని ప్రకటన రావడంతో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆ హెచ్చరికతో ఆసక్తి పెరుగుతున్న సమయంలో రజనీకాంత్ ఒక గన్ను విసరగా, రామ్ ఎంతో స్టైల్‌గా దాన్ని అందుకుంటారు. ఈ పవర్ఫుల్ మూమెంట్ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.

గడ్డం, కళ్లద్దాలతో సిగరెట్ తాగుతూ మాస్ అవతార్‌లో కనిపించిన రామ్ తనదైన స్టైల్‌తో అదరగొట్టారు. అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సీక్వెన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
‘ధర్మన్’(Dharman) చిత్రంతో రామ్ పోతినేని కెరీర్లో మరో కీలకమైన మైలురాయిని అందుకోబోతున్నారు. ఈ సినిమాతో ఆయన తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు, తొలిసారి లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ అన్ని భాషల ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనుంది.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన ఆకర్షణగా, రామ్ పోతినేని వంటి క్రేజీ హీరోల చేరికతో ‘ధర్మన్’పై(Dharman) అంచనాలు మరింత పెరుగుతున్నాయి. భారతీయ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్లలో ఈ చిత్రం ఒకటిగా నిలుస్తోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
