సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం”(Vettuvam) టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “వేట్టువం”(Vettuvam) సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న “వేట్టువం” సినిమా వచ్చే సంక్రాంతి పండక్కి వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “వేట్టువం”(Vettuvam) సినిమా నుంచి మేకర్స్ ‘సెలబ్రేట్ రెసిలియన్స్..’ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ తమ సహనాన్ని పరీక్షించే సందర్భం వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడ్డాయో, తమ శక్తిని ఎలా ప్రదర్శించాయో చూపించడం ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది.
విభిన్న సమూహాల మధ్య ఉండే సంఘర్షణలు, పోరాటాలు, ఊహకందని సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుని దర్శకుడు పా. రంజిత్ “వేట్టువం” సినిమాను రూపొందిస్తున్నారు. “వేట్టువం” పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించబోతోంది.
నటీనటులు – ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబీర్ కల్లరక్కల్, జాన్ విజయ్, సాయి దీన, ఆనంద్ సామి, హరీశ్ ఉత్తమన్, లిజీ, లింగేష్ ప్రేమ్ కుమార్, కవిత భారతి, అర్ుజన్, శాంతకుమార్, మెలొడీ మనీషా, నిమ్మి, రాఫేల్, విక్రమ్, నవీన్, ప్రకాశ్, తదితరులు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
టెక్నీషియన్స్
———————-
యాక్షన్ – దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్ డైరెక్టర్ – ఎస్ఎస్ మూర్తి
ఎడిటర్ – సెల్వ ఆర్.కె.
డీవోపీ – రూపేష్ షాజి
మ్యూజిక్ – జి.వి.ప్రకాష్ కుమార్
కో రైటర్స్ – సంతోష్ నారాయణన్ చెందిల్ కుమార్
బ్యానర్స్ – లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్ – ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్
స్క్రిప్ట్, డైరెక్షన్ – పా. రంజిత్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
