Sunday, June 28, 2026
Homeబిజినెస్Market Crash | భారీ నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు..

Market Crash | భారీ నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు..

  • యుద్ధ ఉద్రిక్తల నేపథ్యంలో నష్టాలు..
  • అమ్మకానికి మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు..

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడిచమురు ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ కీలక సూచీలు 1 శాతానికి పైగా పతనమయ్యాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా నష్టపోయి 73,421 వద్ద ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 286 పాయింట్లు కోల్పోయి 23,080 వద్దకు జారుకుంది.

దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఆటో, ఐటీ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. రియల్టీ సూచీ దాదాపు 2 శాతం పడిపోగా, మెటల్, ఆటో, ఐటీ సూచీలు 1 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీలో విప్రో, టీసీఎస్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి షేర్లు మేజర్ లూజర్లుగా నిలిచాయి. ఫ్రంట్‌లైన్ సూచీలతోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 1 శాతం మేర పతనమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News