తెల్లారితే చాలు.. తెరుచుకుంటున్న మద్యం దుకాణాలు..!
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు.. నిబంధనలు బేఖాతర్..!
ఒక్కో క్వార్టర్ సీసాపై రూ.20.. 90 ఎం.ఎల్పై రూ.10 అదనపు వసూళ్లు..!
మద్యం దుకాణాల్లో ఇదేం దోపిడీ..?Korutla Liquor Bar Violations
ప్రభుత్వ ధరలు ఒకటైతే.. వసూలు చేసేది మరొకటా..?
ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ వసూళ్లా..?
మద్యం దుకాణాలపై తనిఖీలు లేవా..?
అధికారుల మౌనంపై ప్రజల ఆగ్రహం..!
మద్యం విక్రయాలపై చర్యలు ఎప్పుడు..?
నిబంధనలు అమలు చేయాలి.. అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి..!
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ బార్లో మద్యం విక్రయాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరవాల్సి ఉండగా, సదరు బార్ మాత్రం ఉదయం 8 గంటలకే తెరుచుకుని యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగానే మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.Korutla Liquor Bar Violations
క్వార్టర్‌పై రూ.20.. 90 ఎం.ఎల్పై రూ.10 అదనం!
సదరు బార్లో మద్యం కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నుంచి ఒక్కో క్వార్టర్ సీసాపై రూ.20, 90 ఎం.ఎల్ మద్యం సీసాపై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మద్యం విక్రయించాల్సి ఉండగా, అదనపు ధరలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ అదనపు సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 8 గంటలకే విక్రయాలు.. అధికారులకు తెలియదా..?Korutla Liquor Bar Violations
మద్యం విక్రయాలకు నిర్ణీత సమయాలు ఉన్నప్పటికీ, ఉదయం 8 గంటలకే బార్ తెరిచి విక్రయాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి. పట్టణ నడిబొడ్డునే ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల మౌనం వెనుక కారణమేమిటి..?
మద్యం విక్రయాల వేళల ఉల్లంఘన, అదనపు వసూళ్లపై ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు బార్‌పై అధికారులు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించారా..? అదనపు వసూళ్లపై ఫిర్యాదులు అందాయా..? నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై విచారణ చేపడతారా..? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించాలి!Korutla Liquor Bar Violations
కోరుట్ల పట్టణంలోని సదరు బార్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ముందస్తు మద్యం విక్రయాలు, అదనపు వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిర్ణీత ధరలకే మద్యం విక్రయించేలా, అనుమతించిన వేళల్లోనే దుకాణాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
