Homeనల్లగొండBRS Membership Drive | బీఆర్ఎస్‌లోకి భారీగా 300 మంది యువత, మహిళల చేరిక.

BRS Membership Drive | బీఆర్ఎస్‌లోకి భారీగా 300 మంది యువత, మహిళల చేరిక.

  • కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.BRS Membership Drive

పట్టణంలోని 19, 20వ వార్డులకు చెందిన సుమారు 300 మంది యువకులు, మహిళలు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరారు (BRS Membership Drive). మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పింఛన్లు రూ.4 వేలు, రైతు భరోసా పెంపు, యువతులకు స్కూటీలు, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వంటి హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వనపర్తి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఐటీ హబ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పలుస రమేష్ గౌడ్, ఉంగ్లం తిరుమల్, జోహెబ్ హుస్సేన్, శ్రీనివాస్ గౌడ్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News