Friday, May 1, 2026
Homeఖమ్మంNegligence | నిర్లక్ష్యానికి నిలువుటద్దం

Negligence | నిర్లక్ష్యానికి నిలువుటద్దం

పడకేసిన శివనగర్‌ ప్రధాన రహదారి పనులు

  • కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల చోధ్యం
  • అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

ఎవరికి వారు తమ స్వలాభం చూసుకోవడంతో దాని పరిణామం ఇప్పుడు స్థానిక ప్రజలకు శాపంగా మారిందని చెప్పక తప్పదు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం అధికారుల చోధ్యం వెరసి ప్రధాన రహదారి పనులు మందకొడిగా సాగడంతో స్థానికులు నానా యాతన పడుతున్నారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందించాల్సి ఉండగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో ఇప్పుడు శివనగర్‌ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. పాల్వంచలో బైపాస్‌ రోడ్డుకు ఆనుకోని ఉన్న శివనగర్‌ప్రాంత రహదారి నిత్యం రద్ధీగా ఉంటుంది. అయితే కాంట్రాక్టర్‌ పట్టించుకోక పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం… అధికారుల చోద్యం

పాల్వంచ పట్టణ దమ్మపేట సెంటర్‌ నుండి శ్రీనివాస్‌కాలనీ వెళ్లే మార్గం శివనగర్‌ ప్రాంతం ప్రధాన రహదారిపై కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా రోడ్డు పనులు మొదలుపెట్టి ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచ బైపాస్‌ రోడ్డుకు అనుసంధానం జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, వనమా కాలనీల ప్రజలు దమ్మపేట సెంటర్‌ వెళ్లడానికి శివనగర్‌ప్రాంతం నుండి వెళ్లాలి అలాంటి నిత్యం రద్ధీగా ఉండే శివనగర్‌ ప్రధాన రహదారి రోడ్డు పనులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్‌ పనులు గాలికి వదిలేసినట్లు కని పిస్తుంది. పలుమార్లు అధికారులకు తెలియచేసినా వారు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

పాల్వంచ డివిజన్‌ 42వ వార్డు శివనగర్‌ ప్రధాన రహదారి పనులపై ప్రజలు కార్పోరేషన్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్ధీగా ఉండే శివనగర్‌ప్రాంతం రోడ్డుపనులు గత నాలుగు నెలలుగా నూతన రోడ్డు నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నచందంగా ఉంది అధికారుల తీరు. కాంట్రాక్టర్‌ సరిగా పనిచేయకపోతే దగ్గరుండి పనులు చేయించాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉండటంతో కాంట్రాక్టర్‌ తమకు ఇష్టం వచ్చిన రీతిగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ప్రధాన రహదారి పనులు పడకేశాయని, కమిషనర్‌ స్పందించి త్వరితగతిన రోడ్లు,డ్రైనేజీ పనులు పూర్తి చేయించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News