కరీంనగర్ రూరల్ (Karim Nagar Rural) పరిధిలో వివిధ చోట్ల అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్ల(Tractors)ను పోలీసులు సీజ్ (Sieze) చేసి కేసు (Case) నమోదు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కోర్టు(Court)కు పంపారు. గర్రెపల్లిలోని ఆవుల కుమార్ తన యజమాని మహమ్మద్ ఇలియాస్ ఆదేశాల మేరకు, అన్నమల్ల శ్రీనివాస్ తన యజమాని మహమ్మద్ ఇలియాస్ ఖాన్ ఆదేశాల మేరకు బొమ్మకల్ శివారులోని మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తమ ట్రాక్టర్లలో తరలిస్తుండగా బొమ్మకల్‌లోని ఎస్ఎఫ్ఎస్ ఫంక్షన్ హాల్ వద్ద కరీంనగర్ రూరల్ పోలీసులు (Police) పట్టుకున్నారు. సప్తగిరి కాలనీకి చెందిన బొల్లం సంపత్ తన ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఐదుగురిని తహశీల్దార్ ముందు ప్రవేశపెట్టి బైండోవర్ (Bindover) చేశారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ (Rural CI) ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
