Homeకరీంనగర్Tragedy | మేకల మేత కోయడానికి చెట్టు ఎక్కిన మహిళ మృ*తి

Tragedy | మేకల మేత కోయడానికి చెట్టు ఎక్కిన మహిళ మృ*తి

  • విద్యుత్ షాక్‌తోనా లేక ప్రమాదవశాత్తూ పడి చనిపోయిందా..?
  • తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో విషాదం

కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొగ్గుల లక్ష్మి (40) అనే వివాహిత మేకల మేత కోయడానికి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ కిందపడి మృ*తి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మి ఉదయం ఇంటి సమీపంలోని చెట్టు వద్దకు మేకలకు మేత కోసం ఆకులు కోయడానికి వెళ్లింది. ఈ క్రమంలో చెట్టు ఎక్కిన ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృ*తి చెందినట్లు స్థానికులు తెలిపారు.

అయితే చెట్టు పక్కనే విద్యుత్ తీగలు ఉండటంతో, ఆమెకు విద్యుత్ షాక్ తగిలి చెట్టు పై నుంచి కిందపడిపోయి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
Woman Dies After Falling From Tree2

లక్ష్మి మృ*తి కుటుంబ సభ్యులను విషాదంలో ముంచేసిందని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృ*తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News