మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నేతలు (BRS Party Leaders) పరామర్శించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే (Mla) గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ(Mlc)లు శంభీపూర్ రాజు, ఎంసీ కోటిరెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, ఆర్.రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్య గౌడ్, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, హుజూర్‌నగర్ ఇన్‌ఛార్జ్ ఒంటెద్దు నరసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, గుజ్జ యుగంధర్ రావు, నేవూరి ధర్మేందర్ రెడ్డి తదితరులు ప్రగాఢ సానుభూతి (sympathy) తెలిపారు. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల చనిపోయారు.
- Advertisment -
