Homeక్రైమ్ వార్తలుTragedy | కుటుంబ కలహాలతో కాల్పులు..

Tragedy | కుటుంబ కలహాలతో కాల్పులు..

  • మృతుల్లో ఒకేకుటుంబానికి చెందిన ఆరుగురు..
  • అమెరికాలో కలకలం రేపిన కాల్పుల ఘటన..

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఐయోవాలోని మస్కటిన్‌ టౌన్ తూపాకీ తూటాలతో రక్తమోడింది. ఈ కాల్పుల ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారితోపాటు కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించాడు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ కాల్పులు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఘటనపై మస్కటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటన చేసింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12:12 నిమిషాలకు 210, పార్క్ అవెన్యూలోని ఒక నివాసంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నలుగురు వ్యక్తలు తుపాకీ తూటాల గాయాలతో రక్తపుమడుగులో పడివున్నారు. అప్పటికే వారంతా మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News