- – నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
– లబ్ధిదారులకు రూ.2 లక్షల ఎల్వోసి అందజేత
చిలిపిచేడ్: సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నిరుపేదలకు వరమని నర్సాపూర్ (Narsapur) ఎమ్మెల్యే (Mla) సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆపన్నహస్తం(Hand of the Lord)లా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటోందని తెలిపారు. చిలిపిచేడ్ మండలం గుజిరి తాండాకు చెందిన రామావత్ చక్రియా వారం కిందట ప్రమాదవశాత్తూ గాయపడి నిమ్స్(Nims) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన చికిత్స నిమిత్తం రూ.2 లక్షల ఎల్వోసి(Loc)ని సునీతా లక్ష్మారెడ్డి మంజూరు చేయించారు. ఈ ఎల్ఓసీని తాండా మాజీ సర్పంచ్ రాకేష్‌కి అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి కోఆప్షన్ సభ్యులు మన్సూర్, చిలిపిచేడ్ మండలం ముఖ్య నాయకులు దుర్గారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజిరెడ్డి, విఠల్ పాల్గొన్నారు.
