Homeహైదరాబాద్‌Inspection | చిలకలగూడ పోలీస్ స్టేషన్‌ తనిఖీ

Inspection | చిలకలగూడ పోలీస్ స్టేషన్‌ తనిఖీ

  • సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత-మూర్తి
  • పెట్రోలింగ్ వాహనాలు,పరికరాల సమగ్ర పరిశీలన

నేరాల నియంత్రణ శాంతియుత పరిసర ప్రజల రక్షణే పోలీసుల లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సికింద్రాబాద్ జోన్ డిసిపి కే రక్షిత మూర్తి అన్నారు.సోమవారం నాడు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె.మూర్తి,ఆకస్మికంగా చిలకలగూడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.డివిజన్ పరిధిలోని అన్ని పెట్రోలింగ్ కార్లు,బ్లూ కోల్ట్స్ వాహనాలను పరిశీలించి,ఏడీ డ్రిల్ కిట్‌కు సంబంధించిన వస్తువులు, ట్యాబ్స్,వాహనాల స్థితి,పాపిలాన్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.గ్రేవ్ క్రైమ్ సీడీ ఫైళ్లు, చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల రికార్డులను పరిశీలించి నిఘా మరింత కట్టుదిట్టంగా కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు.

DCP Rakshita Murthy Inspects Chilakalguda Police Station1

సిబ్బంది ఎలాంటి అవినీతి కార్యకలాపాలలో పాల్గొనకూడదని హెచ్చరించిన డీసీపీ,ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. 100 డయల్ కాల్స్,ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు.అవసరమైతే కేసు తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.ఫోక్సో కేసులు,సైబర్ నేరాలు,ఆస్తి నేరాల కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి,నేరస్తులకు శిక్ష పడే విధంగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు.బైండోవర్ అయిన రౌడీ షీటర్లు మళ్లీ నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో చిలకలగూడ ఏసిపి కె.శశాంక్ రెడ్డి, చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బి.అనుదీప్,ఎల్.మధు బాబు డీఐ,చిలకలగూడ,
ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News