- అత్యాధునికంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
- శంషాబాద్ విమానాశ్రయం తరహాలో ఆధునీకరణ
- రూ.715 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు
- స్టేషన్లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు
- రైల్వేస్టేషన్ కోసమే ప్రత్యేకంగా 2 సబ్ స్టేషన్ల నిర్మాణం
- ప్రత్యేకంగా 5 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు ఏర్పాటు
- ఆధునీకరణ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శంషాబాద్ విమానాశ్రయం మాదిరిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను తీర్చిదిద్దుతున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునాతనంగా రూపుదిద్దుకో బోతోందని ఇన్నారు. వచ్చే ఏదాది డిసెంబర్లోగా ఆధునీకరణ పూర్తవుతుందని అన్నారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం.. మీడియాతో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను మెట్రో మార్గంతో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు.
రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు సాగుతున్నాయి. స్టేషను 1.65 లక్షల చ.మీ మేర కొత్తగా నిర్మిస్తున్నాం. ఈ స్టేషన్కు నిత్యం 1.97 లక్షల ప్రయాణికులు వస్తుంటారు. 270లక్షల మంది ప్రయాణికుల అవసరాలకు తగినట్లు నిర్మిస్తున్నాం. నడుస్తున్న రైళ్లు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పనులు చేయాల్సి వస్తోంది. ఈ స్టేషన్లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఉంటాయి. రైల్వేస్టేషన్ స్టేషన్ కోసమే ప్రత్యేకంగా 2 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.

5 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది డిసెంబర్లోపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆధునిక సికింద్రాబాద్ స్టేషన్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని కిషన్రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. దక్షిణ భారత దేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొంటూ.. అమృత్ భారత్ పథకం కింద రూ. 714 కోట్లతో ఈ స్టేషనన్ను ఆధునీకరిస్తున్నామని, ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 1,97,000 మంది ప్రయాణికులు రోజువారీగా ఈ స్టేషను వస్తున్నారని, ప్రతి గంటకు సుమారు 23 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ.. పనుల వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నూతన నిర్మాణాలలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ట్రావెలర్ తో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన వెల్లడిం చారు.
సౌత్ సైడ్ బ్లాక్ నిర్మాణం రాబోయే నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని, మొత్తం పునర్నిర్మాణ పనులను 13 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషను 3 ఎకరాల విస్తీర్ణంలో 3 వేల మంది కూర్చునే విధంగా నిర్మిస్తున్నామని.. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదిరిగా అత్యాధునికంగా ఉండనుందని ఆయన పేర్కొన్నారు. నవీకరించబడిన స్టేషన్లో 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, రెండు సబ్ స్టేషన్లు, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్, 5 లక్షల లీటర్ల సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. రోజుకు 2,70,000 మంది ప్రయాణికులు వచ్చినా సేవలు అందించేలా ఏర్పాట్లు జరుగుతు న్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

