Friday, November 14, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంNalgonda | గిరిజన శాఖలో 30 ఏళ్లుగా 'సేట్' దోపిడి!

Nalgonda | గిరిజన శాఖలో 30 ఏళ్లుగా ‘సేట్’ దోపిడి!

హాస్టల్ వార్డెన్లతో షావుకారు వడ్డీ వ్యాపారం
హాస్టల్ విద్యార్థుల నిధులపై పెత్తనం.. అధికారుల మౌనం
రిటైర్డ్ వార్డెన్‌తో చేతులు కలిపి ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్న వైనం

నల్గొండ: పేద గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నల్గొండ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ (DTDC)లో కొందరి (సేట్) పాలిట కామధేనువుగా మారాయి. ఈ శాఖకు ఏమాత్రం సంబంధంలేని ఒక కిరాణా షాప్ (Kirana Shop) షావుకారు (సేట్) గత ముప్పై ఏళ్లుగా తనదైన ‘వ్యక్తిగత సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, ప్రభుత్వ సొమ్మును యధేచ్ఛగా దోచుకుంటున్న వైనం ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. “తీగ లాగితే డొంక కదిలినట్టు”గా షావుకారు అక్రమ వడ్డీ వ్యాపారం(Illegal usury business)పై సమగ్ర విచారణ జరిపితే జిల్లా గిరిజన శాఖలోని ఆక్రమాల బాగోతం మొత్తం బట్టబయలయ్యే అవకాశం ఉందవి గిరిజన సంఘాలు(Tribal Communities), విద్యార్ధి నాయకులు (Student Leaders) అంటున్నారు.

వార్డెన్లతో అక్రమ వడ్డీ వ్యాపారం.. ప్రభుత్వ ఖజానా ఖాళీ..

గిరిజన శాఖ హాస్టల్ వార్డెన్ల(Wardens)తో ఈ సేట్ ఏకంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. హాస్టల్స్(Hostels)కి సంబందించిన అభివృద్ధి పనులు, విద్యార్థుల డైట్ చార్జీల కోసం ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయడంలో ఆలస్యం జరుగుతదేమో దాని, ఆ సేట్ బడ్జెట్ (Budget) ఏమాత్రం ఆలస్యం కాదు! పది రూపాయల వడ్డీకి వార్డెన్లకు అడ్వాన్స్‌గా నిధులను మంజూరు చేసి, ఆ తర్వాత ప్రభుత్వ నిధులు రాగానే వడ్డీ, గుడవిల్తో సహా వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ విధంగా విద్యార్థుల వైట్ డబ్బులు షావుకారు జేబుల్లోకి వెళ్తుండడం గిరిజనవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది..

టెండర్ల(Tenders)కు పాతర.. లెక్కలన్నీ ఆయన చేతిలోనే..

గత 30 సంవత్సరాలుగా గిరిజన శాఖ పరిధిలోని అన్ని హాస్టళ్లకు కిరాణా సామాన్లు, ఇతర వస్తువుల సరఫరాలో ఎలాంటి టెండర్లు లేకుండా ఇతనే ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయిస్తున్నాడు. వస్తువులు, వంట సామాన్లు, కిరాణా సామాగ్రి టెండర్లు సైతం లేకుండా అన్ని పోస్టళ్లకు ఇతనే సరఫరా చేస్తూ వారి బంధువులు, మిత్రులకు చెందిన కిరాణా షాప్ పేర్ల ప్రై బిల్లులు చేయిస్తూ.. తనకు సంబందించిన బ్యాంకు ఖాతా లో కి డబ్బులను జమ చేయించు కుంటూ గిరిజన శాఖ కార్యాలయాన్ని, అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హాస్టల్ రిజిస్టర్స్.. రికార్డుల తయారీ..

హాస్టల్స్ కు సంబంధించిన లెక్కల పుస్తకాలు, రిజిస్టర్లు, బిల్లులు, చెక్కులు, నోచర్లు అన్నీ ఈయన కనుసన్నల్లోనే తయారు చేసి, జిల్లా గిరిజన శాఖ అధికారికి సమర్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే, ప్రభుత్వ లెక్కలన్నీ ఒక ప్రైవేట్ వ్యాపారి (సేట్) నియంత్రణలో ఉండడం శాఖలో ఎంతటి అజమాయిషీ నడుస్తుందో తెలియజేస్తోంది..

జిల్లా యంత్రాంగం పై రిమోట్ కంట్రోల్

నల్గొండ పట్టణానికి చెందిన ఈ షావుకారు తిరుమలగిరి (సాగర్) మండలంలోని ఒక హాస్టల్ లో పని చేస్తూ రిటైర్డ్ అయిన ఒక వార్డెన్ తో కలిసి ఈ వ్యవస్థీకృత అవినీతికి పాల్చదుతున్నట్లు ఆరోపణలున్నాయి?

గిరిజన శాఖలో అతనే బాస్

షావుకారు ఎంత చెబితే ఉద్యోగుల కు అంతే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. డిటిడి కార్యాలయంలో అతని అనుచరులు ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారని అవినీతి ఆక్రమాలపై నిన్న మొన్న ఒక్క రోజులోనే పక్క జిల్లాకి ట్రాన్స్‌ఫర్.. రీపోస్టింగ్ అయిన ఒక ఉద్యోగి విషయంలో కూడా ఈ (సీట్) ఎంటర్ అయి టిటిడి ఓను ముడుపులతో ముంచేత్తాడని సమాచారం.? అధికారులపైనా రిమోట్ కంట్రోల్ ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంది. అందుకే ఈ షావుకారుపై ఎన్ని ఫిర్యా దులు వచ్చినా జిల్లా యంత్రాంగం కనీసం పట్టించుకోక పోవడం.. వెనక పెద్ద మతలబు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గిరిజన శాఖలో నిధులు దుర్వినియోగం అవుతున్నా, విద్యార్థులు నాణ్యమైన ఆహారం, సౌకర్యాలు పొందలేక ఇబ్బందిపడుతున్నా జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, దోషులను శిక్షించాలని విద్యార్ధి సంఘాలు, గిరిజన సం ఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో నిరాహార దీక్షలకు పూను కుంటామని వారు హెచ్చరించారు. ఈ ఆక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News