డైనమిక్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’, ‘కె-ర్యాంప్’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత అలరించారు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సంచలన విజయంతో తన రైటింగ్ ట్యాలెంట్ ని ఇప్పటికే చాటుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు హీరోగా, కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం, కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది.
అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భారీ గంగాళం, మంటలు, పొగల మధ్య బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తున్న కిరణ్ అబ్బవరం సంప్రదాయ గ్రామీణ యువకుడి గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. గ్రామీణ వేడుకల వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ పోస్టర్, ఈ చిత్రాన్ని కూడా ఒక ప్రత్యేక విందులా ఎంతో శ్రద్ధతో రూపొందిస్తున్నామనే ఫీలింగ్ కలిగిస్తోంది. “Ek Dum Bindass Pakaane Waale” అనే ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తికరంగా మార్చింది.
ఈ చిత్రంతో దేవికా భట్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


ఈ రోజు హైదరాబాద్‌లో చిత్ర బృందం, నటీనటులు హాజరైన ఒక భారీ పూజా కార్యక్రమంతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం అనంతరం వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. తొలి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది.
దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే కిరణ్ అబ్బవరం పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారు. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలతో పాటు తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్ డీవోపీ వ్యవహరిస్తుండగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న కిరణ్ అబ్బవరం, తొలిసారి మెగాఫోన్ పట్టడం, అలాగే భారీ స్థాయిలో నిర్మాణం జరగడం వల్ల ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, దేవిక భట్, శరత్ కుమార్, సాయి కుమార్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: కిరణ్ అబ్బవరం
నిర్మాత: సుధాకర్ చాగంటి
బ్యానర్: జాయ్ ఫిల్మ్స్
సహ నిర్మాత: సురేష్ ఎర్ర
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: విశ్వాస్ డేనియల్
ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
ఎడిటర్: సంతోష్ నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్ కామర్సు
PRO: వంశీ-శేఖర్
