మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మహాగర్జన..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదు. పైగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, రైతుల కష్టాలు, అవినీతితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజల నమ్మకాన్ని వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వ వైఖరిని నిలదీసే సమయం ఆసన్నమైంది. మన ప్రియతమ నాయకుడు వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు..
మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ శ్రేణులు శుక్రవారం రోజు ఉదయం నుండి గర్జిస్తున్నాయి. వెన్నుపోటుకు రెండేళ్లు భారీ నిరసన ర్యాలీ విజయవంతం ఇది కేవలం నిరసన కాదు ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వైయస్ఆర్ సీపీ ఇచ్చిన గట్టి హెచ్చరిక. ప్రతి కార్యకర్త ఒక యోధుడిలా కదలివచ్చి ఈ మహా నిరసనలో భాగస్వామ్యమయ్యారు.
శుక్రవారం రోజు ఉదయం 10:00 గంటలకే మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ కార్యాలయం వద్ద ఈ మహా నిరసన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. అక్కడి నుండి బయలుదేరిన పార్టీ శ్రేణులు మిద్దె సెంటర్ మీదుగా గాలి గోపురం వరకు భారీ బైక్ ర్యాలీగా తరలివెళ్లాయి. అనంతరం గాలి గోపురం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ శ్రేణులంతా కలిసి భారీ పాదయాత్రగా సాగుతూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించారు.
ఈ మహా నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, రాష్ట్ర ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్, మంగళగిరి టౌన్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, మంగళగిరి రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమర నాగయ్య, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు, అనుబంధ విభాగాల సభ్యులు అందరూ రికార్డు స్థాయిలో తరలివచ్చి, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ నిరసన గళాన్ని వినిపించి ఈ కార్యక్రమాన్ని మహా విజయవంతం చేశారు.
