సిద్దిపేట: ఇటీవలి భారీ వర్షాల (Rains) ప్రభావంతో జిల్లాలో పంచాయతీరాజ్(Panchayati Raj), ఆర్ అండ్ బి (R and B) విభాగాలకు చెందిన వంతెనలు(Bridges), కల్వర్టులు(Culverts), రహదారులు (Roads) తీవ్రంగా దెబ్బతిన్నాయని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం కలెక్టరేట్(Collectorate)లో జిల్లా అధికారులతో సమావేశం (Meeting) నిర్వహించిన ఆమె.. ఆ దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు(Proposals) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పాడైన ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మునిసిపల్ భవనాలు తదితర నిర్మాణాల మరమ్మత్తుల కోసం కూడా విభాగాల వారీగా పూర్తి వివరాలతో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.

రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ధాన్యం కోసిన వెంటనే తేమ శాతం తగ్గక ముందే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం వల్ల అకాల వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని చెప్పారు. రైతులు ముందుగా ఇంటి వద్ద లేదా మైదానాల్లో సరిగా ఆరబెట్టి నిర్ణీత తేమ శాతం వచ్చిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు రైతులకు ఈ విషయంలో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, డిప్యూటీ కలెక్టర్ (శిక్షణ) భవ్య, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, వ్యవసాయ, మున్సిపల్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
