ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar) నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో సగర సంఘం (Sagara Sangham) నూతన కమిటీ హాల్(Committee Hall)ను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (Kuchakulla Rajesh Reddy).. ఎంఎల్సీ (Mlc) దామోదర్ రెడ్డి(Damodar Reddy)తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యేకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

దీంతో.. సభ సందడి సందడిగా మారింది. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధి కోసం సంఘాలు దృఢంగా ఉండాలని అన్నారు. ప్రతి సంఘానికి గౌరవం, గుర్తింపు, సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. తూడుకుర్తి గ్రామానికి ఈ కమిటీ హాల్ ఒక శాశ్వతమైన అభివృద్ధికి గుర్తుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్, జిల్లా అధ్యక్షుడు పోతుల శ్రీనివాసులు, గట్టయ్య, గ్రామ సగర సంఘం నాయకులతోపాటు స్థానిక నేతలు, మహిళలు, యువత భారీగా పాల్గొన్నారు.


