ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) వర్ధన్నపేట ఎమ్మెల్యే (Wardhannapet Mla), విశ్రాంత ఐపీఎస్ అధికారి (Retired IPS Officer) కేఆర్ నాగరాజు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో (Rains affected areas) బుధవారం పర్యటించారు. పర్వతగిరి మండల పరిధిలోని సోమారం, వర్ధన్నపేట మండలం పరిధిలోని ఇల్లంద, కట్ర్యాల గ్రామాలను సందర్శించారు. తుఫాన్ ధాటికి ఇండ్లు(Houses), పంటలు (Crops) నష్టం వాటిల్లిన పొలాల(Fields)ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాధితులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

