బాన్సువాడ (Banswada) పట్టణంలోని కల్కి చెరువు(Kalki Lake)లో 100% ప్రభుత్వ సబ్సిడీతో ఉచిత చేప (Fish) విత్తనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యుడు (Mla) పోచారం (Pocharam) శ్రీనివాసరెడ్డి బుధవారం విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

అనంతరం.. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన డబుల్ బెడ్ రూం ఇండ్ల (Double Bedroom Houses) లబ్ధిదారులకు రూ.4 కోట్ల ఇండ్ల బిల్లుల(Bills)ను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దుర్గం శ్యామల శ్రీనివాస్, బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

