Friday, November 14, 2025
ePaper
Homeనిజామాబాద్‌Mla Vemula | చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్వోసీ

Mla Vemula | చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్వోసీ

ఆసుపత్రిలో చికిత్స (Treatment) పొందుతున్న వ్యక్తికి బాల్కొండ ఎమ్మెల్యే (Balkonda Mla) వేముల ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy) అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన అమ్రీన్ బేగం ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ (Nims) హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కోసం రూ.2 లక్షలకు ఎల్వోసీ (LOC) మంజూరుచేయించి కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్యం కోసం సాయం చేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోమని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News