నల్గొండ : నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారి NH-65 రైల్వే అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర సమస్య గా మారింది. గత మూడు రోజులుగా కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్(traffic)నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆర్డీఓ అశోక్ రెడ్డి(RDO Ashok Reddy),చిట్యాల మున్సిపల్ కమిషనర్(Chityala Municipal Commissioner), రెవిన్యూ అధికారులు(Revenue officials), NHAI అధికారులు అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించారు.

గత మూడు రోజులుగా భారీ వర్షాల(rains) కారణంగా ట్రాఫిక్ జామ్ పరిస్థితి కొనసాగుతోంది.ఎస్‌డిఆర్‌ఎఫ్, ఫైర్, మున్సిపల్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని ఎత్తివేస్తున్నారు.వర్షపు నీటిని పక్కనే వున్న పోతరాజు కుంటకు(Potharaju Kunta) మళ్లించే డ్రైనేజీ వ్యవస్థ పాడైపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని గుర్తించిన ఆర్డీఓ.పోతరాజు కుంట ను పక్కనే ఉన్న రైస్ మిల్ యజమాని ఆక్రమణ, మరియు మున్సిపల్ చెత్త డంపింగ్ కారణంగా నీటి ప్రవాహం నిలుస్తుందని వెంటనే ఆక్రమణలను తొలగించి, పోతరాజు కుంట పునరుద్ధరణ ద్వారా శాశ్వత పరిష్కారం చేపడతామని ఆర్డీఓ హామీ. పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి, ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు.

