- వెల్లడించిన పాప్ సింగర్ కేటీ షెర్రీ..
- ఆయనే నాకు సర్వస్వం అని వెల్లడించిన వైనం..
అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తో తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, ఆయనే తన జీవితానికి సర్వస్వం అని ఆమె ప్రకటించారు. ఇటీవల న్యూయార్క్ నగరంలో జరిగిన ‘కేటీ పెర్రీ : ది లైఫ్‌టైమ్స్ టూర్’ కాన్సర్ట్ ఫిల్మ్ ప్రీమియర్‌కు ఆమె జస్టిన్ ట్రూడోతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తొలిసారిగా ఇద్దరూ జంటగా రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఈ కార్యక్రమంలో కేటీ పెర్రీ మాట్లాడుతూ.. ‘నేను గాఢమైన ప్రేమలో ఉన్నా. నా జీవితానికి సర్వస్వం అయిన వ్యక్తిని కలిసిన తర్వాతే ఈ షో చేశా. ఆయన నా జీవితానికి ఒక లంగరులా నిలిచారు. నేను ఒక రంగుల గాలిపటం లాంటి దాన్ని, ఎంతో ఎత్తుకు ఎగురుతా. అలాంటి నాకు ఒక ఆధారం అవసరం. ఇప్పుడు ఆ ఆధారం దొరకడంతో నా జీవితం పరిపూర్ణంగా అనిపిస్తోంది’ అని ఆనందం వ్యక్తంచేశారు. తన జీవితం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
