Tuesday, November 11, 2025
ePaper
Homeఖమ్మంCongress Activists | బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా

Congress Activists | బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా

  • మణుగూరులో బీఆర్ఎస్(BRS) కార్యాలయంపై కాంగ్రెస్(Congress) కార్యకర్తల దాడి
  • అక్కడి ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు నిప్పంటించిన కాంగ్రెస్ కార్యకర్తలు
  • ఇది గతంతో కాంగ్రెస్ కార్యాలయమే అన్న కార్యకర్తలు
  • బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చిన రేగా కాంతారావు!
  • కార్యాలయాన్ని స్వాదీనం చేసుకునే క్రమంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ
  • బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యకర్తలు దాడికి పాల్పడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు(Congress Activists) అక్కడి ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టారు. అంతేకాకుండా, కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను చించివేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రభుత్వానికి చెందిన స్థలంలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని కాంగ్రెస్(Congress) నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని. పరిస్థితిని అదుపులోకి తీసుకోచ్చారు. అయితే మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా(Congress MLA) గెలిచి బీఆర్ఎస్లో చేరారు.

పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని కాంగ్రెస్ కార్యకర్తలు(Congress Activists) చెబుతున్నారు. నాదు అధికారం అండతో రేగా కాంతారావు చేసిన చర్యను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోలేకపోయారు. అప్పటి నుంచి కార్యాలయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు(Congress Activists) ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కార్యాలయం కోసం కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త స్థలాన్ని డొనేట్ చేశారు. ఆ స్థలంలో కార్యాలయ నిర్మాణం చేపట్టారు. అయితే మొన్నటి ఎన్నికల్లో రేగా కాంతారావు ఓడిపోయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో ఉత్తేజం వచ్చింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు(Congress Activists) అందరూ ఈ కార్యాలయంలోకి చొరబడి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాగ్రి, కుర్చీలు బయటకు తెచ్చి పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈవివాదంతో మణుగూరు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలు గుంపులు, గుంపులుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News