Wednesday, June 10, 2026
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ కౌంటీ జట్టుతో స్పిన్నర్ మానవ సుతార్ డీల్..

ఇంగ్లాండ్ కౌంటీ జట్టుతో స్పిన్నర్ మానవ సుతార్ డీల్..

  • స్వల్పకాలిక ఒప్పొందం..
  • టెస్ట్ మ్యాచ్ లో సత్తా చాటిన భారత స్పిన్నర్. .

ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన ఏకైక టెస్టులో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన స్పిన్న‌ర్ మాన‌వ్ సుతార్‌.. ఇప్పుడు ఇంగ్లండ్ కౌంటీ జ‌ట్టు వార్‌విక్‌షైర్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. కౌంటీ టీమ్‌తో స్వ‌ల్ప కాలిక ఒప్పందం కుదిరిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఆఫ్ఘ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేసిన రాజ‌స్థానీ బౌల‌ర్‌.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌తీశాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో అత‌ను త‌న ఖాతాలో కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే వేసుకున్నాడు. వార్‌విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్ల‌బ్ మాన‌వ్ సుతార్‌తో ఒప్పందంపై ప్ర‌క‌ట‌న చేసింది. షార్ట్ ట‌ర్మ్ కాంట్రాక్టు కుదుర్చుకున్న‌ట్లు ఆ కౌంటీ పేర్కొన్న‌ది. రోతేసే కౌంటీ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా జ‌రిగే త‌ర్వాత రెండు రౌండ్ల మ్యాచ్‌ల‌కు సుతార్ ఆ జ‌ట్టుకు అందుబాటులో ఉండ‌నున్నాడు. సుతార్‌కు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ మంచి రికార్డు ఉన్న‌ది. 29 మ్యాచుల్లో అత‌ను 129 వికెట్ల‌ను తీసుకున్నాడు. ఇంగ్లండ్‌లో జ‌రిగే కౌంటీల్లో ఆడ‌డం వ‌ల్లే మాన‌వ్ సుతార్‌కు మ‌రింత అంత‌ర్జాతీయ అనుభవం రానున్న‌ది.

- Advertisement -

ఆగ‌స్టులో శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు ముందు సుతార్ కౌంటీల్లో ఆడ‌నున్నాడు. మాన‌వ్ సుతార్ మా జ‌ట్టుతో చేర‌డం సంతోషంగా ఉంద‌ని వార్‌విక్‌షైర్ ప‌ర్ఫార్మెన్స్ డైరెక్ట‌ర్ జేమ్స్ థామ‌స్ తెలిపారు. యార్క్‌షైర్‌, సోమ‌ర్‌సెట్‌తో జ‌రిగే మ్యాచుల్లో సుతార్ ఆడ‌నున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News