Friday, May 1, 2026
Homeఆంధ్రప్రదేశ్PV Sindhu | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు ప్రశంసలు..

PV Sindhu | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు ప్రశంసలు..

  • కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధత..
  • గ్రామీణ ఏపీని బలోపేతం చేయడంపై దృష్టి..
  • పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పీవీ సింధు..

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై ఆమె స్పందించింది. కార్మికుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను సింధు అభినందించింది.

ఈ సందర్భంగా పీవీ సింధు స్పందిస్తూ, “కార్మికుల సంక్షేమం, గౌరవం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను చూడటం చాలా సంతోషంగా ఉంది. దీనితో పాటు గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారించడం అభినందనీయం. మేడే రోజున ఇది ఎంతో అర్థవంతమైన సందేశం. మన ప్రియమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News