- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి – స్వప్న రాణి
పెద్దపల్లి: బాల్య వివాహాలను(Child marriage) నిరోధించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,న్యాయమూర్తి స్వప్న రాణి(judge swapna rani) అన్నారు. బాల్య వివాహాల(Child marriage) నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఆమె విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు.
చట్టరీత్యా నేరం:
జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తా వద్ద మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వప్న రాణి(judge swapna rani) మాట్లాడుతూ, బాల్య వివాహాలు(Child marriage) చేయడం లేదా వాటిని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరం అని స్పష్టం చేశారు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండకముందే పెళ్లి చేయడం వల్ల వారికి కలిగే మానసిక,శారీరక మరియు ఆర్థిక అనర్థాలను ఆమె వివరించారు.
బాల్య వివాహాల(Child marriage) నిషేధ చట్టం 2006 గురించి వివరిస్తూ,వీటి నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా “ఒక ఆడపిల్ల పుట్టడం, బ్రతకడం, ఎదగడం, చదవడం” అనే నినాదాన్ని విద్యార్థులతో పలికించి, బాల్య వివాహాలను(Child marriage) నిరోధిస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ సుచరిత, అకౌంటెంట్ సమత,సఖి సిఏ స్వప్న,ఐసిపిఎస్ (పివోఎన్ఐ) కనకరాజు,నశా ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల,పోలీసు సిబ్బంది,మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
