Friday, June 19, 2026
Homeఆరోగ్యంButtermilk | జీలకర్ర కలిపి మజ్జిగ తాగితే ఏమవుతుందో తెలుసా..?

Buttermilk | జీలకర్ర కలిపి మజ్జిగ తాగితే ఏమవుతుందో తెలుసా..?

  • షుగర్ ను నివారించవచ్చు..
  • చౌకైన ప్రాచీనకాలపు పానీయం..

నేటి ఆధునిక జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా ఇళ్లలో షుగర్ ఒక సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఒక్కసారి ఈ చక్కెర వ్యాధి శరీరంలోకి ప్రవేశిస్తే.. దానిని పూర్తిగా నయం చేయడం కష్టం. కానీ సరైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీనవశైలి ద్వారా దీనిని ఖచ్చితంగా నియంత్రించవచ్చు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము తినే ప్రతి ముద్ద గురించి, తాగే ప్రతి చుక్క గురించి ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది.

అయితే మన ఇళ్లలోనే ఉండే అత్యంత చౌకైన, పాతకాలపు పానీయం ఒకటి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే మనందరికీ ప్రియమైన మజ్జిగ. మజ్జిగ అనేది ఒక సహజ ప్రోబయోటిక్ పానీయం. ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది డయాబెటిస్ ఉన్నవారికి పూర్తిగా సురక్షితం. అయితే ఈ మామూలు మజ్జిగ తాగడానికి బదులుగా, దానికి ఒక ప్రత్యేకమైన పొడిని జత చేస్తే దాని శక్తి రెట్టింపు అవుతుంది. ఆ అద్భుత ఔషధ పొడియే జీలకర్ర పొడి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News