అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) రాబడి పెరిగింది. 8.7 శాతం రెవెన్యూ గ్రోత్ (Growth) నమోదు చేసింది. నికర జీఎస్టీ వసూళ్లు (Net Gst Collections) రూ.3021 కోట్లకు చేరాయి. గత నెలలో ఈ వృద్ధికి పలు అంశాలు దోహదపడ్డాయి. ఇటీవల పన్నుల రేట్లు (Tax Rates) తగ్గించడంతోపాటు జీఎస్టీ సంస్కరణలను అమలుచేసినప్పటికీ గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ నికర జీఎస్టీ వసూళ్లు 8.77 శాతం పెరిగాయి. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక అక్టోబర్‌లో ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావటం ఇది రెండోసారి మాత్రమే. స్థూల (Gross) జీఎస్టీ వసూళ్లు రూ.3,490 కోట్లుగా నమోదయ్యాయి. తద్వారా.. అక్టోబర్‌లో అత్యుత్తమ పనితీరు (Excellent Performance) కనబరిచిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి చేరుకోవటం విశేషం. అధునాతన డేటా విశ్లేషణలు, టార్గెటెడ్ ఆడిట్‌లు, మెరుగైన IGST పరిష్కార విధానాలు, పనితీరు ఆధారిత అధికారుల విస్తరణ వంటి వ్యూహాత్మక చర్యలే ఈ ఫలితాలకు కారణమని తెలిపారు.
